హైదరాబాద్ డిసెంబర్ 9: అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతాము అని మాజీ మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు… ఎప్పుడు రైతు బంధు ఇస్తారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని తెలిపారు. వడ్లు అమ్ముకొకండి.. తాము బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అధికారంలోకి వచ్చారు.. రూ. 500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిగ్‌జాం తుపాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని, అలాంటి రైతులను ఆదుకోవాలని హరీశ్‌రావు కోరారు.
రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తారు: హరీశ్‌రావు
Published By Voice Today Team
182
- Advertisement -
- Advertisement -
- Tags
- cm kcr announces rythu bandhu
- harish rao
- harish rao about rithu bandu scheme
- harish rao about rythu runa mafi
- harish rao launches bc bandhu
- rythu bandhu
- rythu bandhu 11th tranche
- rythu bandhu 2023 update
- rythu bandhu assistance to farmers
- rythu bandhu disbursed as assistance to farmers
- rythu bandhu funds
- rythu bandhu funds disburse
- rythu bandhu money into farmers accounts
- rythu bandhu scheme
- rythu runa mafi
- telangana rythu bandhu
- telangana rythu runa mafi



