డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో
Under the auspices of the District Drugs Disposal Committee
26.437 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల
నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సభ్యులు ఏఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు
మనకొండూర్ మండలం ఈదులగట్టపల్లి నందుగల వెంకటరమణ ఇన్సినేటర్స్ కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లో నేషనల్ డ్రగ్ డిస్పోజల్ లో భాగంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 83 కేసులలో స్వాదీనపరచుకున్న 26 కిలోల 437 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు. జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగులబెట్టుట జరుగుతుందని తెలియజేసారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య, డిసిర్బీ సి.ఐ శ్రీనివాస్, ఆర్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.