లయన్స్ క్లబ్ అధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేత

- Advertisement -

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేత
కమాన్ పూర్
రామగిరి మండలం  కల్వచర్లకు చెందిన అసం శంకర్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణ రెడ్డి  దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఆరోజు దహన సంస్కరణ కార్యక్రమం కోసం తక్షణ సహాయం కింద 5000 రూపాయలను అందించడం జరిగింది. తదనంతరం  వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి లయన్స్  క్లబ్ ప్రెసిడెంట్ మోల్మురి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించారు. సింగరేణి సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ లక్ష్మి నారాయణ,లైయజన్  ఆఫీసర్ గడ్డం శ్రావణ్ కుమార్  లను సంప్రదించి 3000 రూపాయల నిత్యవసర సరుకులను ఆ
కుటుంబానికి  ఇవ్వడం జరిగింది. లయన్స్  క్లబ్ పేదలకు సహాయం చేయడం లో ముందుంటుందని ,దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఎవరైనా సహాయం చేయలనుకొనేవరు లయన్స్  క్లబ్ ను సంప్రదించాలని ప్రెసిడెంట్ మోల్మురి శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్స్ దొడ్ల శ్రీనివాస్, సత్తిరెడ్డి,  మేకల మారుతి,తీగల శ్రీధర్,ప్రతాప్ రెడ్డి,  తిరుపతిరెడ్డి, భూపెందర్, అసం ప్రభాకర్ పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular