బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం

- Advertisement -

బాలానగర్ : అక్టోబర్ 30(వాయిస్ టుడే): కూకట్ పల్లి సర్కిల్ బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నేతృత్వంలో సోమవారం కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని డివిజన్ పరధిలోని వినాయక్ నగర్ మరియు సాయి నగర్ లో ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలైన దళితబంధు, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గత తొమ్మిది న్నరేండ్లు గా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రానున్న ఎన్నికల అనంతరం ప్రజలకు ఏం చేయబోతున్నామో వివరిరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

under-the-leadership-of-balanagar-corporator-avula-ravinder-reddy-gadapa-gadapa-campaign
under-the-leadership-of-balanagar-corporator-avula-ravinder-reddy-gadapa-gadapa-campaign
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular