Friday, February 20, 2026

అర్ధం కానీ పవన్ వ్యూహం

- Advertisement -

అర్ధం కానీ పవన్ వ్యూహం
కాకినాడ, ఫిబ్రవరి 19, (వాయిస్ టుడే )

Understandable, but Pawan’s strategy
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తన గ్రాఫ్ తగ్గించుకుంటున్నట్లే కనపడుతుంది. ప్రశ్నించాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఆయన ప్రశ్నించడమే మానేశారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం జగన్ ఓటమి కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారా? లేక ఆయన ముఖ్యమంత్రి కావడానికి వచ్చారా? అని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పవన్ కల్యాణ్ పై ఇంతకు ముందు ఫైర్ కనిపించడం లేదని పోస్టు చేస్తున్న వీడియోలు ఇందుకు నిదర్శనం. పార్టీ నేతల నుంచి అభిమానుల వరకూ పవన్ కల్యాణ్ వ్యూహం ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. మరొకవైపు జగన్ ను ఓడించాలంటే మనం సీట్లు త్యాగం చేయాల్సిందేనని ఇప్పటి నుంచే చెబుతున్న హితోక్తులు కూడా వారిని కలవరపెడుతున్నాయి.జగన్ ను ఓడించడానికి అయితే రాజకీయాల్లోకి రావడం ఎందుకన్న ప్రశ్న కాపు సామాజికవర్గం నుంచి వస్తుంది. తొలిసారి కాపు సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చూడాలనుకున్నామని, కానీ పవన్ కల్యాణ్ మాటలను చూస్తుంటే ఆయన ఎప్పటికీ సీఎం పదవి కోరుకోవడం లేదని అర్థమవుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తుంది. మరొకవైపు కాపు సామాజికవర్గం సమస్యలపై కూడా ఆయన మాట్లాడకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాపు రిజ్వేషన్లు అమలు చేయించడం, కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పేదలైన కాపు కుటుంబాలను ఆదుకునే పనికి కూడా పవన్ కల్యాణ్ చేపట్టడం లేదన్న విమర్శలున్నాయిఈ నేపథ్యంలో క్రమేపీ పవన్ కల్యాణ్ గ్రాఫ్ ఇటు కాపు సామాజికవర్గంలోనూ అటు పార్టీ క్యాడర్ లోనూ పోతుంది. మరొకవైపు ఆయన సినీ అభిమానులు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు. నియోజకవర్గాల్లో తమకు విలువ లేకుండా చేస్తున్నారని చెప్పినా పవన్ వినిపించుకోవడం లేదని, తాము తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని జనసేన ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జనసేనలో చాలా మంది సైలెంట్ అయ్యారు. పవన్ కల్యాణ్ వ్యూహం తమకు అర్థమయిందని, కేవలం జగన్ ఓడించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని, తాను ముఖ్యమంత్రి కావడానికి రాలేదన్నది స్పష్టంగా కనిపిస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ ను అభిమానించే వారు మాత్రం ఆయన ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే అనుభజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతిస్తున్నారని, అందుకే తగ్గుతున్నారని అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్