Monday, December 23, 2024

నిరుద్యోగ తమ్ముళ్లారా…… ఈ 23 రోజులు మీరు పడ్డ గోసలను యాది చేసుకోండి

- Advertisement -

మీ కోసం యుద్దం చేసి జైలుకు పోయిందెవరో గుర్తు చేసుకోండి
9 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ అంటే నమ్మేదెవరు?
మాట తప్పబోం.. బీజేపీకి అవకాశమిస్తే… 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు
కరీంనగర్ లో పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్

కరీంనగర్: ‘‘నిరుద్యోగ తమ్ముళ్లారా…… కేసీఆర్ రాక్షస పాలనలో మీరు పడ్డ గోసలు ఈ 23 రోజులు గుర్తుచేసుకోండి. మీ కుటుంబాలు పడుతున్న బాధలను యాది చేసుకోండి. 9 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ అంటూ మభ్యపెడుతున్న దండుపాళ్యం ముఠా మాటలు నమ్మకండి. అట్లాగే మీకోసం యుద్దం చేసిన బీజేపీని గుర్తుంచుకోండి. రాబోయే ఎన్నికల్లో మీరిచ్చే తీర్పుతో బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాంక్ కావాలె….’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ యువకులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట మేరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడుస్తామన్నారు. బీసీ నాయకుడే సీఎం అవుతారని ఉద్ఘాటించారు. కేసీఆర్ కు దమ్ముంటే… ఆయన రాజకీయ వారసుడెవరో ఎన్నికల తరువాత ఎవరిని సీఎం చేస్తారో ప్రకటించాలని సవాల్ విసిరారు.

unemployed-brothers-yadi-the-gosas-you-fell-for-these-23-days
unemployed-brothers-yadi-the-gosas-you-fell-for-these-23-days

కరీంనగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నిన్న నామినేషన్ దాఖలు చేసిన. పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుసుకుంటున్న. నిన్న నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా యువత వేలాదిగా తరలివచ్చి భారత్ మాతా కీ జై… జై శ్రీరాం అంటూ బీజేపీకి మద్దతు తెలిపారు. ఈ ర్యాలీ చరిత్ర స్రుష్టించింది. బీజేపీ విజయానికి ఇది సంకేతం. బీఆర్ఎస్ నేతలకు ఈ ర్యాలీని చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది.

unemployed-brothers-yadi-the-gosas-you-fell-for-these-23-days
unemployed-brothers-yadi-the-gosas-you-fell-for-these-23-days

ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బులిచ్చి వేల మందిని తీసుకొచ్చి పోటీగా ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారు. మీరెన్ని చేసినా గెలుపు బీజేపీదే. ఇది నా మాట కాదు.. కేసీఆరే నిర్ణయానికి వచ్చారు. అందుకే బి.ఫాం ఇవ్వకుండా చాలా రోజులు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధిని తిప్పలు పెట్టిండు. దీనినిబట్టి తీర్పు ఎప్పుడో డిసైడ్ చేశారు.

బండి సంజయ్ అవినీతిపరుడు కాదు… ఎక్కడా భూ కబ్జాలు చేయలే. ఎవరినీ ఇబ్బంది పెట్టలే. ఇయాళ బీఆర్ఎస్ నేతల లెక్క లంగ దందా, దొంగ దందాలు చేసేటోడిని వెంటపెట్టుకుని తిరగలే. కమీషన్లు ఇప్పిస్తేనే పోలీస్ స్టేషన్లలో పనులు అయ్యేటట్లు నేను చేయడం లేదు?

నన్ను ఎంపీగా గెలిపిస్తే వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన. అభివృద్ధి చేస్తున్న. కేంద్ర నిధులు తీసుకొచ్చిన. కానీ అభివృది అడ్డుకుంటోందెవరు. రేషన్ కార్డు కూడా ఇయ్యలేనోడు ఎవరు? ఆలోచించుకోవాలి.

బండి సంజయ్ పేదల కోసం పోరాడుతున్నడు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతునైన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోరాటాలు చేసి సమాజాన్ని ఏకం చేసిన. ఇప్పుడు నేను గెలిస్తే… ఆయనకు ఏకు మేకు అవుతాననే భయంతో కరీంనగర్ కు వందల కోట్లు పంపి నన్ను ఓడించాలని చూస్తున్నడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

కేసీఆర్ కొడుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. సీఎం కొడుకుగా కాకుంటే ఆయనది బిచ్చపు బతుకే. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నడు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడట… ఈ 9 ఏళ్లపాటు నువ్వు చేసిందేమిటి? ఏ గడ్డి పీకినవ్? ఎందుకు ఉద్యోగాలియ్యలే. జాబ్ క్యాలెండర్ ఎందుకియ్యలే. నిరుద్యోగుల ఉసురు ఎందుకు పోసుకున్నవ్? అసలు మళ్లీ నీ ప్రభుత్వం వస్తే కదా…
50  లక్షల మంది నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీని తరిమి తరిమి కొట్టబోతున్నారని కేసీఆర్ కొడుకుకు అర్ధమైంది. అందుకే ప్రతిరోజు మళ్లీ ఛాన్స్ ఇస్తే జాబ్ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాయ మాటలు చెబుతున్నడు. నిరుద్యోగ తమ్ముళ్లారా… ఈ 10 ఏండ్లలో ఉద్యోగాల కోసం మీరు పడ్డ గోసను ఇంకో 23 రోజులు గుర్తుంచుకోండి. మీ కుటుంబాలు పడుతున్న బాధలను గుర్తు చేసుకోండి. మీరిచ్చే తీర్పుతో బీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలె. మీరిచ్చే తీర్పుతో మరే రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగులను మోసం చేయాలనే ఆలోచన రాకుండా చేయాలే.

బీజేపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ మేరకు బీసీ నాయకుడే సీఎం అవుతారు. బీజేపీ ఈ విషయాన్ని చెబుతుంటే… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను కించపరుస్తున్నడు. నేను కేసీఆర్ ను సవాల్ చేస్తున్నా… నీకు దమ్ముంటే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పే దమ్ముందా? కనీసం గతంలో ఇచ్చిన మాటకు నిలబడి దళితుడిని సీఎం చేసే దమ్ముందా? నువ్వు నిజంగా మనిషివైతే.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే… నీ రాజకీయ వారసుడెవరో ప్రకటించే దమ్ముందా?…. నా సవాల్  కు స్పందించాలి.
బంగారు తెలంగాణ తెస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి జనం ఓట్లేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. పేదల ఉసురు పోసుకున్నడు.  అందుకే ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి, బీఆర్ఎస్ నేతల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ధర్మ రక్షకులకు, ధర్మ ద్రోహులకు….. రజాకార్లకు, రామరాజ్య స్థాపకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. రామరాజ్యం కావాలా? రజాకార్ల రాజ్యం కావాలా? తేల్చుకోండి.

unemployed-brothers-yadi-the-gosas-you-fell-for-these-23-days
unemployed-brothers-yadi-the-gosas-you-fell-for-these-23-days

కాంగ్రెస్, ను గెలిపిస్తే… కాసులకు అమ్ముడుపోతారు. ప్రమాణ స్వీకారం చేయకముందే పార్టీలు మారే చరిత్ర కాంగ్రెస్ ది. 2014లో 21 మందిని గెలిపిస్తే 10 మంది అమ్ముడుపోయారు. 2018లో 19 మందిని గెలిపిస్తే ఏకంగా 14 మంది టోకుగా అమ్ముడుపోయారు. ఇప్పుడు కేసీఆర్ 50 మంది కాంగ్రెస్ అభ్యర్ధులకు పైసలిచ్చారు. సొంత పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నరని తెలిసి ఇదంతా చేస్తున్నడు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే. ఈ మూడు పార్టీలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నయ్.  ఈ మూడు పార్టీలు దండుపాళ్యం ముఠా. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు… అధికారంలోకి వస్తే ఈ మూడు పార్టీలు జిల్లాలు పంచుకుని.. ప్రజల రక్తం తాగే ప్రమాదముంది.
నేను తెలంగాణ ప్రజలను కోరేదొక్కటే. మీ కోసం కేసీఆర్ రాక్షస పాలనపై యుద్దం చేసినం. నాతోపాటు బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నరు. రాళ్ల దెబ్బలు తిన్నం. జైలుకు పోయినం. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచిన. 15 వందల కిలోమీటర్ల యాత్ర చేసిన. పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకనై మీరంతా తలెత్తుకునేలా పోరాటాలు చేసిన. అవినీతి మరక లేకుండా మచ్చలేని జీవితాన్ని కొనసాగిస్తున్నం. దయచేసి ఈ సారి బీజేపీకి అవకాశమివ్వాలని కోరుతున్నా. నన్ను గెలిపిస్తే అసెంబ్లీలో మీ పక్షాన పోరాడతా. రాష్ట్రాన్ని అభివ్రుద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్