Sunday, September 8, 2024

మంత్రులకు తప్పని పోటీ

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 27, (వాయిస్ టుడే):  తెలంగాణ ఎన్నికల  ప్రచారం తుది దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుంది. అగ్ర నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. మంత్రుల నియోజకవర్గాల్లో ఈ సారి పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఈ సారి మంత్రుల పరిస్థితి ఏంటి? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్‌  సహా ఎన్నికల బరిలో 15 మంది మంత్రులు ఉన్నారు. ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థులను దించాయి. సీఎం కేసీఆర్ ను కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , గజ్వేల్ లో ఈటల రాజేందర్‌  ఢీ కొడుతున్నారు. కరీంనగర్ లో మంత్రి గంగులపై బీజేపీ నుంచి బండి సంజయ్‌ బరిలో ఉన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ను ఓడించడమే లక్ష్యంగా తుమ్మల నాగేశ్వరరావును పోటీకి దించింది కాంగ్రెస్ పార్టీ. మహేశ్వరంలో సబితా ఇంద్రా రెడ్డిపై కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి అందెల 40 వేల ఓట్లు సాధించడం గమనార్హం. ఈ సారి సబితా అందెల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు.

– ధర్మపురి నుంచి బరిలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల తేడాతో విజయం సాధించారు కొప్పుల.

– నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించడానికి బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బలంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏలేటి.. ఈ సారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో దాదాపు 9 వేల ఓట్ల తేడాతో ఇంద్రకరణ్ విజయం సాధించారు.

– ఖమ్మం- పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఈ సారి మాజీ మంత్రి తుమ్మల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

– సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సంకినేని నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు సార్లు ఓడిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ సారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

– కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌ – బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ నువ్వా- నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. గత ఎన్నికల్లో 14 వేల ఓట్ల తేడాతో గంగుల విజయం సాధించారు.

– మహబూబ్‌నగర్‌ – శ్రీనివాస్ గౌడ్ – ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్