విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ , మాజీ మంత్రి ఎంమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ :వాయిస్ టుడే
Union Minister Bandi Sanjay and former Minister Gangula Kamalakar unveiled the Vidyanagar Munnur Kapu Sangam New Year Calendar.![]()
విద్యానగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో వారి చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కనకం అమర్ బాబు పటేల్ మాట్లాడుతూ… విద్యానగర్ మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ను ఉగాది పురోదినని పురస్కరించుకొని నేడు మాజీ మంత్రి కరీంనగర్ సాధన సభ్యుల గంగుల కమలాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించామని అదేవిధంగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మున్నూరు కాపు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, చేతుల మీదుగా వారి వారి క్యాంపు కార్యాలయాలలో క్యాలెండర్ను ఆవిష్కరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యానగర్ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణం కొరకు, స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయుటకు ఎమ్మెల్యే గంగుల హామీ ఇచ్చినట్టు వారి తెలిపారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సంఘ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు సంఘ అధ్యక్షులు కనకం అమర్ బాబు పటేల్, సంఘం గౌరవ అధ్యక్షులు బోనాల నరసయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి అట్టపెల్లి శ్రీనివాస పటేల్, కోశాధికారి రామ్మోహన్ పటేల్, మాజీ ఎంపిటిసి ఉప్పు శ్రీనివాస్ పటేల్, సంఘం బాధ్యులు, నరేందర్ పటేల్, తిరుపతి పటేల్ శ్రీనివాస్ పటేల్ లు ఉన్నారు.