- Advertisement -
కేటీఆర్ ఇలాకలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన
Union Minister Bandi Sanjay's visit to KTR Ilakaకరీంనగర్
కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య స్కూల్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. విద్యార్దులు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని… టాయిలెట్ లో నీళ్ళు రావడం లేదని విన్నవించారు. ఏం చేస్తున్నారని అధికారులను మంత్రి సంజయ్ మందలించారు. మీ పిల్లలకైతే అట్లానే తిన్పిస్తామా అని నిలదీసారు. ఏకలవ్య స్కూల్స్ కు మోదీ ప్రభుత్వం భారీగా నిధులిస్తోంది. ఒక్కో విద్యార్ధిపై రూ.1.09 లక్షల ఖర్చు చేస్తున్నా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. మరిమడ్ల రెసిడెన్షియల్ స్టాప్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశించారు. అప్పటికప్పుడు టాయిలెట్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు మంత్రి సంజయ్.
- Advertisement -




