ముషీరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Union Minister’s visit to Mushirabad
హైదరాబాద్
ముషీరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలసి హజర్ గల్లీలో డ్రైనేజీ పైప్లైన్, రాంనగర్ గొల్ల నాగులు గల్లీ, జాంభవి నగర్, బాపూజీ నగర్ శివాలయం వద్ద సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు హైదరాబాద్ అంటే అంబర్పేట్, ముషీరాబాద్ లాంటి పాత నగరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలని అన్నారు.
నగరం నుంచే అధిక ఆదాయం వస్తున్నా కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. పౌరులకు కనీస వసతుల ఏర్పాటు కోసం అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
హైటెక్ సిటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ద పాత నగరం పై చూపడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.