నా విజయానికి పొత్తుతో సహకరించిన కాంగ్రెస్,పొత్తు లేకున్నా సంపూర్ణ మద్దతు ఇచ్చిన సీపీఎం,మొదటి సారి మద్దతు ఇచ్చిన న్యూడెమోక్రసీ, ప్రజపంథా, టీడీపీ,జనసామితి పార్టీలకు ధన్యవాదాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
కవులు,రచయితలు,మేధావులు,గాయకులు నా గెలుపు కోసం పనిచేశారు. అన్ని కమ్యూనిష్టు పార్టీల భావజాలాన్ని అసెంబ్లీ లో వినిపించాలని మిత్ర పక్షాలు కోరుకున్నాయి. కమ్యూనిస్టుల ఐక్యత,అవసరం ఉంది. గతంలో సీపీఎం,సీపీఐ పార్టీ రాళ్లు వేసుకున్న పరిస్థితి నుంచి నిస్వార్ధంగా కలిసి పనిచేసే స్థితికి వచ్చాము. దేశంలో ధన రాజకీయాలు నడుస్తున్నాయి. లక్షల మంది నేను గెలవాలని కోరుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూశాక ప్రజలు ఎలాగైనా వారిని ఇంటికీ పరిమితం చేయాలని కోరుకున్నారు. కోల్ బెల్ట్ లో ఉన్న 11 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. కమ్యూనిష్టులు ఉన్న ప్రతి చోటా కాంగ్రెస్ గెలిచింది. మా పార్టీ ఓటు శాతం ఈ ఎన్నికల్లో పెరిగింది. సీపీఎం పార్టీ ని ఎవరూ తప్పు పట్టకూడదు. కాంగ్రెస్ తో పొత్తు కోసం చివరి వరకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్క స్థానము అయినా తీసుకోవాలని అనుకున్నాం. మా టార్గెట్ బీజేపీ, బీఆరెస్ ఓటమి. కమ్యూనిష్టు పార్టీల పని అయిపోయిందని అనుకోవద్దు. ఓటు శాతం తగ్గొచ్చు కానీ అంతరించిపోలేదు. రాజకీయాలు అసహ్యంగా ఉన్నాయి. కమ్యూనిష్టులే పవిత్రంగా రాజకీయాలు చేస్తారు. కమ్యూనిష్టులు పదవుల కోసం,ఆస్తులకోసం పోరాడలేదు. ప్రజల్లో చైతన్యం కోసం,వారి జీవితాల్లో మార్పు కోసమ్ పోరాడారు. నా గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సంబరాలు జరిగాయి. అంటే అంతమంది కమ్యూనిష్టులు అసెంబ్లీ లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు విప్లవం రాదు కానీ,భవిష్యత్ ఉంది. డబ్బు లేనిదే ఎన్నికలు లేవు.. అలా అని వదిలేద్దామా. దామాషా బట్టి స్థానాలు తీసుకోవాలి. అలా అయితేనే అన్ని పార్టీలు బ్రతుకుతాయని అన్నారు.



