Tuesday, March 17, 2026

గిట్టుబాటులేక.. ఫ్రీగా టమాట…

- Advertisement -

గిట్టుబాటులేక.. ఫ్రీగా టమాట…
మెదక్, మార్చి 17, (వాయిస్ టుడే)

Unremunerative Prices… Tomatoes Given Away for Free
మాట రేట్లు దారుణంగా పడిపోవడంతో.. ఓ రైతు కీలక నిర్ణయం తీసుకున్నాడు. టమాటా పంటను మార్కెట్‌కు తీసుకురాగా.. అక్కడ గిట్టుబాటు ధర లేకపోవడంతో.. అక్కడికి వచ్చిన ప్రజలకు ఉచితంగా తన టమాట

పంటను మొత్తం పంచిపెట్టాడు. ఫ్రీగా టమాటలు ఇస్తున్నారనే విషయం తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. పండించిన పంటకు ధర లేకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు

రైతులు టమాటలను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు.ప్రస్తుతం టమాటకు ధర లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీగా పెట్టుబడి పెట్టి టమాట పంటను పండించి.. కోసి మార్కెట్‌కు తీసుకువస్తే..

కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వినియోగదారులకు మాత్రం టమాట అంత తక్కువ ధరకు దొరకడం లేదు. మధ్యలో ఉన్న దళారులే టమాటపై భారీగా

లాభాలు పొందుతున్నారు. అటు రైతులు, ఇటు వినియోగదారులకు లాభాలు లేకుండా.. దళారులే కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు.. టమాటను మార్కెట్‌కు తీసుకువచ్చి

ధర లేక పారబోయడం, కనీసం మార్కెట్ ఖర్చులు కూడా రాకుండా బాధపడటం చూస్తూనే ఉన్నాం.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ రైతు.. తాను పండించిన టమాట పంటను తీసుకుని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ

మార్కెట్‌కు వచ్చాడు. అయితే కిలో టమాటకు దళారులు కేవలం రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. కొత్తగూడలో సంత కావడంతో గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన ఒక

రైతు ఆటోలో టమాటాలను తీసుకొచ్చాడు. అయితే టమాట పంటను కొనుగోలు చేసేందుకు అక్కడ వ్యాపారులు ఎవరూ ముందుకు రాలేదు.దీంతో తమ గ్రామం నుంచి అంతదూరం ఆటోలో టమాట పంటను

తీసుకొచ్చిన ఆ రైతు.. మళ్లీ తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే ఉచితంగా పంచిపెట్టాడు. తాను తీసుకొచ్చిన ఆటోలో టమాటాలను ఓపెన్ చేసి.. అక్కడికి వచ్చిన వారికి ఫ్రీగా ఇచ్చేశాడు. దీంతో ఫ్రీగా టమాటాలు

వస్తుండటంతో స్థానికులు భారీగా ఎగబడ్డారు.ప్రస్తుతం మార్కెట్‌లో టమాటలకు ధర లేకపోవడంతో టమాట పండించిన రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి పక్కన పెడితే.. కనీసం వాటిని తెంచడానికి

అయిన కూలీల ఖర్చు, మార్కెట్‌కు తీసుకొచ్చిన ఖర్చులు కూడా రావడం లేదని.. తమ చేతి నుంచే ఎదురు ఖర్చులు చేయాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టమాటకు గిట్టుబాటు ధర

కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.మరికొందరు రైతులు టమాట పంట పండినా.. ధర లేకపోవడంతో.. వాటిని తెంపితే కూలీల ఖర్చు అవుతుందని.. వాటిని అమ్మినా ఆ ఖర్చులు కూడా

రావని భావించి.. పొలాల్లోనే అలాగే వదిలేస్తున్నారు. మరికొందరు రైతులు పశువులకు మేతగా టమాటలను వేస్తున్నారు. ఇంకొందరు రైతులు.. తమ పొలాల్లోకి వచ్చి ఎవరైనా ఫ్రీగా కోసుకుని వెళ్లొచ్చని ఆఫర్లు

ఇస్తున్నారు. వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి టమాట పంటను సాగుచేస్తే.. పంట చేతికి వచ్చిన తర్వాత రేటు దారుణంగా పడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. బయట కూరగాయల

మార్కెట్లో మాత్రం వినియోగదారులకు కిలో టమాటా రూ.20 కి తక్కువకు దొరకకపోవడం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్