రేవంత్, భట్టి అత్యవసర భేటీ

- Advertisement -

రేవంత్, భట్టి అత్యవసర భేటీ

తాజా రాజకీయ పరిణామాలు, కొండా సురేఖ వ్యాఖ్యలపై చర్చ

ప్రభుత్వ తదుపరి చర్యలు, పార్టీ వ్యూహంపై సమాలోచనలు

Urgent meeting between Revanth and Bhatti

హైదరాబాద్, ఆగస్టు 24 (వాయిస్ టుడే):
తెలంగాణ రాజకీయాల్లో వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

కొన్ని రోజులుగా వివాదాస్పద అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో వాటి ప్రభావంపైనా సీఎం, డిప్యూటీ సీఎం సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారంలో ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలి? పార్టీ ప్రతిష్ఠకు ఎలాంటి నష్టం కలగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదేవిధంగా రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలు, వివిధ శాఖల పనితీరు, పెండింగ్‌లో ఉన్న కీలక నిర్ణయాలపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అత్యవసర భేటీకి ప్రాధాన్యం ఏర్పడటంతో కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular