కేంద్ర ఎన్నికల పరిశీలకులు బసవరాజేంద్ర
జగిత్యాల: ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల పరిశీలకులు బసవ రాజేంద్ర సూచించారు…శుక్రవారం జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు బసవ రాజేంద్రను తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులు కలిసి పుష్పగుచ్ఛం అందించి వృద్ధులు,దివ్యంగులకు హోమ్ ఓటింగ్ సౌకర్య కల్పనకు కృతజ్ఞతలు తెలిపారు.సీనియర్ సిటిజెన్లకు,దివ్యంగులకు ప్రత్యేక క్యూ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో 80 ఏళ్ళు పై బడిన వృద్ధులు ,40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యంగులు ఎన్నికల కమిషన్ కల్పించిన హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించు కోవడాన్ని అభినందించారు. పోలింగ్ రోజున సైతం వృద్ధులు ,దివ్యంగులు నేరుగా వోటింగ్ సౌకర్యం పొందవచ్చని,అలాగే జిల్లా సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలని,హోమ్ ఓటింగ్ పై అవగాహన కల్పించడంపై అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,వారి సంఘ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారి ఎండి.వకీల్ , సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కార్యదర్శి గౌరిశెట్టీ విశ్వనాథం,ఉపాధ్యక్షుడు ఎండి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావు,సయ్యద్ యూసుఫ్,ఎండి.ఎక్బాల్,బొల్లం విజయ్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.