ఉస్తాద్ విడుదలకు సిద్దం
Ustad Bhagat Singh Movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
మార్చి 26వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా ‘పెద్ది’ని విడుదల చేయాలని అనుకున్నారు. అయితే…వివిధ కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. దాంతో ఆ తేదీకి ఒక్క రోజు ముందు బాబాయ్ పవన్ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.’ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. మిగతా పాటల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.



