- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ శాసనసభను ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహాన్ సందర్శించారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు తదితరులు సతీశ్ మహాన్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి మెమెంటో బహూకరించారు. శాసనసభ సమావేశాల నిర్వహణ, పద్ధతులపై ఇరు రాష్ట్రాల సభాపతులు చర్చించారు.
- Advertisement -