ఆమోదించిన అమెరికా
వాషింగ్టన్ నవంబర్: చికున్‌గున్యాతో (జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా వ్యాక్సిన్‌ను తయారుచేసింది. ఈ టీకా వాడకానికి అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఆమోదించింది. దోమల ద్వారా వ్యాపించే వైరస్‌ను ఈ టీకా ద్వారా అడ్డుకోవచ్చని ఎఫ్‌డీఏ అధికారులు చెప్పారు. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు దీనిని ఉపయోగించవచ్చని వెల్లడించారు. వైరస్ ప్రబలుతున్న దేశాల ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. లిక్స్‌చిక్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను విక్రయించనున్నారు.జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే చికున్‌గున్యా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది. గత 15 ఏండ్లలో 5 మిలియన్లకుపైగా రోగులు ఈ వ్యాధి బారిన పడ్డారు. కాగా, ఈ వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపించిందని, దీంతో అది ప్రపంచవ్యాప్త వ్యాధిగా పేరొందిందని ఎఫ్‌డీఏ అధికారులు వెల్లడించారు. చికున్‌గున్యా వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైన వ్యాధి అని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఎఫ్‌డీ సీనియర్ అధికారి పీటర్ మార్క్స్ చెప్పారు. దీనివల్ల వృద్ధుల్లో ఎక్కవగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఉత్తర అమెరికాలో 3,500 మందిపై దీనిని పరీక్షించామని అధికారులు తెలిపారు.అయితే ఈ వ్యాక్సిన్ వల్ల తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం లాంటి సాధారణ దుష్ప్రభావాలు వెలుగుచూశాయని అధికారులు చెప్పారు. 1.6 శాతం మందిలో మాత్రమే తీవ్రమైన దుష్ప్రభాబాలు కనిపించాయని, మరో ఇద్దరు దవాఖానలో చేరాల్సి వచ్చిందని వెల్లడించారు.