వడ్డే ఓబన్న మనందరికీ స్పూర్తి
Vadde Obanna is an inspiration to us all
వడ్డే ఓబన్న వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించిన
ముఖ్యమంత్రి చంద్రబాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు
వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
పుట్టపర్తి :
వడ్డే ఓబన్న మనందరికీ ఆదర్శనీయుడని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొనియాడారు. పుట్టపర్తి కలెక్టరేట్లో వడ్డే ఓబన్న 218 వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, డి ఆర్ ఓ పార్థసారథి , వడ్డెర సంఘం నాయకులు హజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తోందని తెలిపారు అందుకు కూటమి ప్రభుత్వానికి ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భరతమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఆంగ్లేయులపై పోరాటం చేసిన యోధుడని అభివర్ణించారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడుగా పనిచేశారని తెలిపారు. ఆంగ్లేయులు రైతులపై విధించిన శిస్తు రద్దు కోసం, ఆడపిల్లల రక్షణ కోసం వడ్డే ఓబన్న ప్రాణాలు లెక్కచేయకుండా పోరాటం చేశారని తెలిపారు. వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.వడ్డెర సమస్యలపై అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం వచ్చినందుకుఎంతో గర్వపడుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు.టీడీపీకి మద్దతుగా నిలిచిన వడ్డెర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు వడ్డెర్లను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వడ్డెర కార్పొరేషన్ కు అధిక నిధులు ఇచ్చి వారి జీవన విధానాన్ని పెంపొందించాలని కోరినట్లు తెలిపారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చేర్చాలని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపిణీ విషయాన్ని గుర్తు చేశారు. వడ్డెర కులస్తులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారని వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉండి సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారులను పూర్తిగా తీసుకోవాలని మాజీమంత్రి పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి అన్ని మండలాల్లో విగ్రహ ఏర్పాటు చేసే విధంగా స్థలాన్ని కేటాయించాలని పలువురు వడ్డెర సంఘం నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిని కోరారు.