ఒక వైపు వైకాపా, మరోవైపు టీడీపీ..
గాంధీ బొమ్మ సెంటర్ లో ఉద్రిక్తత
ఇబ్రహీంపట్నం
వైసిపి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటుచేసిన వేడుకలకు జోగి రమేష్ హజరయ్యారు. మరోపక్క టిడిపి ప్రభుత్వ ఆధ్వర్యంలో కృష్ణానది పవిత్ర సంగమం వద్ద కృష్ణ గోదావరి జలా హారతి కార్యక్రమం ఉండటంతో టిడిపి పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. మరోపక్క వైసీపీ నాయకులు పక్కన ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు పోలీసులు కొంత సమయం ఆగాలని సూచించారు. దీంతో మరికొంత సమయంలో జోగి రమేష్ వస్తున్నారన్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి ఏర్పాటు చేసిన స్థలమునకు చేరుకొని జై టిడిపి అంటూ నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో గందర గోళ వాతావరణం నెలకొంది.
ఒక వైపు వైకాపా, మరోవైపు టీడీపీ..
- Advertisement -
- Advertisement -