Friday, October 18, 2024

ఆదికవిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి వాల్మీకి

- Advertisement -

ఆదికవిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి వాల్మీకి

Valmiki is a great person who is known as Adhikari

ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్..
డుంబ్రిగుడ
రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్ అన్నారు.అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ సేవ పథకం, తెలుగు విభాగం ఆధ్వర్యంలో గురువారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భరత్ కుమార్ నాయక్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృత సాహిత్యంలో పేరు పొందినకవి వాల్మీకి అన్నారు. సంస్కృతంలో రామాయణ మహా కావ్యాన్ని రచించి ఆదికవిగా పేరుగాంచిన వ్యక్తి వాల్మీకి మహర్షి అన్నారు. విద్యార్థులు వాల్మీకి మహర్షి లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకొని అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సోంబాబు, వై విజయలక్ష్మి, అనిత కుమారి, వైస్ ప్రిన్సిపల్ పుష్పరాజు, కొండబాబు, గణేష్, రాజు, లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్