Monday, March 24, 2025

వంశీ ఎదుగదల చూడలేక అరెస్ట్

- Advertisement -

వంశీ ఎదుగదల చూడలేక అరెస్ట్
విజయవాడ, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)

Vamsi was arrested because he could not see the growth

వల్లభనేని వంశీపై చంద్రబాబు, లోకేష్ కుట్ర చేశారని.. వారి సామాజికవర్గం నుంచి వల్లభనేని వంశీ రాజకీయంగా ఎదురుగుతున్నారని కుట్ర చేసి జైల్లో పెట్టారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో ఫిర్యాదుదారు అయిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్ డ్రా చేసుకునేలా చేశారన్న కేసులో అరెస్టు అయి రిమాండ్ లో వంశీని జగన్ పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి పట్టాబి వల్ల  జరిగందన్నారు. పట్టాభి వైసీపీ ఆఫీసుపైకి దాడి చేయడానికి మనుషులతో బయలుదేరారని అన్నారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లనే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని .. వంశీని ఆయనే రెచ్చగొట్టారని జగన్ అన్నారు. ఆ దాడి కేసులో కేసు కావాలనే సత్యవర్ధన్ తో పెట్టించారని ఆరోపించారు. గన్నవరంలో దాడి జరిగింది కిడయాల సీతారామయ్య అనే వ్యక్తి బిల్డింగ్ పై అన్నారు. అయితే అందులో టీడీపీ ఆఫీసు ఉంది. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ఈ కేసు పెట్టారు. అయినా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వయక్తి కావడంతో కేసు ఆయనతో పెట్టించారని.. కడియాల సీతారామయ్య  ఎస్సీ, ఎస్టీ కనీసం బీసీ కాదని జగన్ ఆరోపించారు.పోలీసులు పెట్టిన కేసులో  వల్లభనేని వంశీ పేరే లేదని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కేసును రీఓపెన్ చేశారని ఆరోపించారు. వంశీకి బెయిల్ రాకూడదని.. నెలల తరబడి జైల్లో ఉంచేలా కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జగన్ ఆరోపించారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వారు టోపీ మీదున్న మూడు సింహాలకు సెల్యూట్ చేయాలన్నారు. చంద్రబాబుకు సెల్యూట్ చేయవద్దని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ఏ ఒక్క అధికారినీ వదిలి పెట్టబోమన్నారు.        తప్పు చేసిన వారు సప్త సముద్రాల అవతల ఉన్నా .. రిటైర్ అయినా..  బట్టలూడదీసి నిలబెడతామని జగన్ హెచ్చరించారు. ప్రజలు, దేవుడు శిక్షించే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వైసీపీ ఆఫీసు వద్దకు కొడాలి నాని సహా చాలా మంది సీనియర్ నేతలు వచ్చారు. కార్యకర్తలను పోలీసులు కంట్రోల్ చేయకపోవడంతో వారు జగన్ మీడియాతో మాట్లాడుతున్న ప్రాంతానికి వచ్చారు. మాట్లాడుతున్న సమయంలో నినాదాుల చేస్తూ ఆటంకం కలిగించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్