- Advertisement -
పేద వర్గాల మంచి కోసం పోరాడే..ఆదర్శ నాయకుడు వంగవీటి మోహన రంగా
Vangaveeti Mohana Ranga is an ideal leader who fights for the good of the poor
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ డిసెంబర్ 26:
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పెదవర్గాల ఆదర్శనాయకుడు రంగా అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు.స్వర్గీయ వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా, ఏజీకే స్కూల్ సెంటర్లోని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జోహార్ రంగా అంటూ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మహానుభావుడైన రంగ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. పేదల కోసం ఆయన చేసిన మంచి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాల ద్వారా చిరస్థాయిగా నిలిచే ఉంటారని ఎమ్మెల్యే రాము అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన రంగా, కుల మత రాజకీయాలకు అతీతమైన గొప్ప నాయకుడని కొనియాడారు.ఈ సందర్భంగా పేదల కోసం రంగా చేసిన పోరాటాలను కూటమి నాయకులు స్మరించుకున్నారు.
ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ బిజెపి అధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, పండ్రాజు సాంబయ్య, చేకూరు జగన్ మోహన్ రావు, జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్,నాయకులు సాయన రాజేష్, సందు పవన్, పందిళ్ళ మల్లి, పేర్ని జగన్, కొదమల గంగాధర్, పలువురు కూటమి నాయకులు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని రంగా విగ్రహానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
- Advertisement -