
వంగవీటి రంగా 35 వ వర్ధంతి సందర్భంగా కాపు జాగృతి చందు జనర్ధన్(apuwj జనరల్ సెక్రటరీ),రంగిశెట్టి మంగ బాబు(rtd IRS) ఆధ్వర్యంలో రంగా ఇంటి సమీపములోని మాకినేని బసవపూర్ణయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్కరణ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాయిస్ టుడే న్యూస్ ఎండీ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ హాజరై రంగా విగ్రహనికి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగలో ఉన్న ప్రముఖులు రంగా తో కలిసి పని చేసిన అనుభవం మరియు రంగా కు ప్రజలతో ఉన్న అనుబంధం సభ లో వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళ లకు వర్థంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు.అనంతరం మహిళల తో కలిసి క్యాండిల్ లైట్ ర్యాలీ వంగవీటి రంగా విగ్రహం వరకు నిర్వహించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రమణ్యం, చందు సాంబశివ రావు, ఐకాన్ సీఈఓ ,
మానికొండ. కోదండపాణి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సేవా సమితి అధ్యక్షులు), కూనపు రెడ్డి. రమేష్ బాబు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సేవా సమితి గౌరవ సలహాదారులు మరియు EC మెంబర్), పాలంకి. రామారావు (కాపు రాక్స్), కొండిశెట్టి. రాజేంద్ర (మాజీ క్రీడై అధ్యక్షులు, బిల్డర్), బసేట్టి.ప్రసాద్ (కాపు నాయకులు)మరియు కుల ప్రముఖులు అభిమానులు మహిళలు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



