తిరుపతి: వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారు బంగారు రథంపై తిరుచానూరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.బంగారు రథోత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి వాహన మండపానికి తీసుకొచ్చారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో దివ్యంగా అలంకరించి బంగారు రథంపై ఆసీనులను చేసారు. అనంతరం మంగళ వాయిద్యాలు కోలాటాలు పండరి భజనలు ముందుకు సాగగా అమ్మవారు బంగారు రథంపై ఆసునులై తిరు వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రథోత్సవం సందర్భంగా తిరుచానూరు తిరుమాడ వీధులు గోవింద నామస్వరలతో మార్మోగాయి.ఈ బంగారు రథోత్సవంలో టీటీడీ అధికారులు భక్తులు పాల్గొన్నారు.