Thursday, December 12, 2024

మత్స్యసంపదను పెంచడానికి పలు చర్యలు

- Advertisement -

మత్స్యసంపదను పెంచడానికి పలు చర్యలు

Various measures are taken to increase the fish stock

హైదరాబాద్
హైదరాబాద్, డిసెంబర్ 12 :: రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహెరా, రాష్ట్ర మత్స్య శాఖ అధికారులతో ఈ రోజు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచడానికి పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఎస్ఎన్యే-స్పార్ష్  ఖాతాలో అందుబాటులో ఉన్న పిఎంఎంఎస్వై 2024-25 కింద కేటాయించిన నిధులు ఆ ఆర్ధిక సంవత్సరం  చివరి నాటికి వినియోగించుకోవాలని నిర్ణయించారు.  మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి రిజర్వాయర్ వద్ద 100% గ్రాంట్‌పై సిఎంఎంఎస్వూ -సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 2024-25 కింద రూ.25 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా కొర్రమీను చేపల పెంపకం కోసం ప్రతిపాదించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ సరస్సు వద్ద        రూ.2 కోట్లతో రిక్రియేషనల్ ఫిషరీస్, రాష్ట్ర మత్స్య శాఖ సంబంధించి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న అన్ని బీమా కేసులను క్లియర్ చేయాలని ప్రతిపాదించారు.
మత్స్య సంపద అభివృద్ధి కార్యకలాపాల విస్తరణ కోసం రాజేంద్ర నగర్‌లోని ఎన్ఎఫ్డీబీ B కార్యాలయ భవనానికి ఆనుకుని అదనంగా 10 ఎకరాల భూమిని కేటాయించాలని ఎన్ఎఫ్డీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ఎఫ్డీబీ లో పథకాలు, నిధుల అవకాశాలపై అవగాహన కల్పించడంపై జనవరి 7, 8వ తేదీలలో క్షేత్రస్థాయి మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. చేపల వినియోగాన్ని ప్రోత్సహించడానికి  జోడించిన ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఫిబ్రవరి/మార్చి 2025లో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో సంయుక్తంగా (ఎన్ఎఫ్డీబీ & డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్) ఫిష్ ఫెస్టివల్ 2025 నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో డాక్టర్ బిజయ్ కుమార్ బెహెరా, చీఫ్ ఎగ్జిక్యూటివ్, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, హైదరాబాద్, పి.నెహ్రూ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ NFDB, రాష్ట్ర  మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్