- Advertisement -
లోక్ సభ ఎలెక్షన్లలో పోటీ చేయనున్న వీరప్పన్ కూతురు
ఎర్రచందనం స్మగ్లర్ , కిడ్నాపర్ , వన్యప్రాణుల వేటగాడైనా వీరప్పన్ కూతురు 2024 లోక్ సభ ఎలక్షన్ లలో పోటీ చేయనున్నారు.
విద్య వీరప్పన్ బెంగళూరు లో లా డిగ్రీ పూర్తి చేసారు. NTK (నామ్ తమిజర్ కట్చి ) పార్టీ తరఫున క్రిష్ణగిరి లోక్ సభ సీట్ కి ఈమె పోటీ పడనున్నారు.
2020 లో బీజేపీ లో చేరిన విద్య వీరప్పన్ , తన తండ్రి వీరప్పన్ పై NTK నాయకుడు సీమన్ “కూసే మునిసామి వీరప్పన్ “ డాక్యుమెంటరీలో వెల్లడించిన అభిప్రాయాలు నచ్చి NTK పార్టీ లో చేరారు.
తమిళనాడు, కర్ణాటక ల సరిహద్దుల్లో గల సత్యమంగళం అడవుల్లో తన స్మగ్గ్లింగ్ సామ్రాజ్యాన్ని నడిపిన వీరప్పన్, 18 అక్టోబర్ 2004 లో తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతుల్లో హతమయ్యాడు.
- Advertisement -