Sunday, September 8, 2024

ఎన్నికల ప్రచారంలో వాహన ర్యాలీ లు లేకుండా చూడాలి

- Advertisement -
Vehicular rallies should be avoided during election campaign
Vehicular rallies should be avoided during election campaign

ప్రచారం పేరుతో కాలుష్యం పెంచుతున్నారు
వాహన ర్యాలీలపై నియంత్రణ పాటించాలి
ఎన్నికల సంఘం పర్యవేక్షణ ముమ్మరం చేయాలి
రాజకీయ పార్టీలకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వినతి

హైదరాబాద్ నవంబర్ 11: గెలువు ఆరాటంలో వందల వాహనాలతో కాలుష్యాలు పోగుపెడుతున్నారని, తక్షణమే వాహన ర్యాలీలకు బ్రేక్ వేయాలని “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.  శనివారం కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీహెచ్ రంగయ్య బాగ్ లింగం పల్లి కౌన్సిల్ కార్యాలయంలో మాట్లాడుతూ. .. వ్యవస్థ సంక్షేమానికి పాటు పడాల్సిన రాజకీయరంగం ఎన్నికల పేరుతో ధ్వంస రచనకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం  చేశారు. నాయకులు వారి మెహర్బానీ కోసం  ప్రచారంలో నిబంధనలకు మించి, పర్యావరణానికి విఘాతం జరుగుతున్నా  ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాల కారణంగా మొన్నటి కరోనా విపత్తు సృష్టించిన నష్టం మరిచిపోరాదని ఆయన పార్టీలకు గుర్తు చేశారు. ప్రతి రాజకీయ పార్టీ విజ్ఞత పాటించి ప్రచారంలో వాహన శ్రేణి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.  ఎన్నికల సంఘం కూడా మరింత నిఘా పెంచి తన వంతు పాత్ర నిర్వర్తించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్