Friday, April 3, 2026

వేముల వర్సెస్ కోమటిరెడ్డి

- Advertisement -

వేముల వర్సెస్ కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 3, (వాయిస్ టుడే)

Vemula vs. Komatireddy
తెలంగాణలో హ్యామ్ రోడ్డు టెండర్ల చుట్టూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. రూ. 8 వేల కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించగా.. మంత్రి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాటిని తీవ్రంగా ఖండించారు. టెండర్లు అన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరుగుతున్నాయని.. తనపై బురద చల్లడం మానుకోవాలని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఈ

వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిందితెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం

తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో అభివృద్ధి, పలు శాఖల్లో అవినీతిపై సభ్యులు విమర్శలు గుప్పించుకున్నారు. ఇక తాజాగా.. రాష్ట్ర రాజకీయం రోడ్ల అభివృద్ధి, హ్యామ్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. తనపై, ప్రభుత్వంపై

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని, పనితీరును ఉద్దేశించి మంత్రి కీలక కామెంట్స్ చేశారు.

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ అవినీతికి తావివ్వలేదన్నారు. తాను నిప్పు లాంటి వ్యక్తినని.. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి అవినీతి మరకలు లేవన్నారు. కనీసం ఆరోపణలు కూడా

రాలేదని.. అలాంటిది తన శాఖపై బురద చల్లాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి మండిపడ్డారు.హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో చేపడుతున్న రోడ్డు పనుల్లో భారీ స్కామ్ జరుగుతుందన్న

విమర్శలను కోమటిరెడ్డి ఖండించారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. పారదర్శకంగానే రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఈ టెండర్లన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్

అథారిటీ నిబంధనల ప్రకారమే ఖరారు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్ల నిర్మాణం, నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రోడ్ల గురించి, టెండర్ల ప్రక్రియ గురించి వేముల ప్రశాంత్ రెడ్డికి కనీస జ్ఞానం లేదన్నారు. గత పదేళ్లలో

రాష్ట్రంలో రోడ్లను అధ్వాన్నంగా మార్చిన వారు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.కాగా, రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న హ్యామ్ రోడ్స్ విధానంలో రూ.8 వేల కోట్ల

స్కాం జరుగుతుందని వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇటీవల ఆరోపించారు. 6 వేల కిలోమీటర్ల హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల కోట్లతో టెండర్ల పిలిచారన్నారు. మొబిలైజేషన్ కింద 10 శాతం అంటే రూ. 1300 కోట్లు

ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యిందని ఆరోపించారు. ఈ టెండర్‌లో ఎక్సెస్ టెండర్ వేసుకోవాలని ప్రభుత్వమే సలహాలు ఇవ్వటాన్ని ఆయన తప్పుబట్టారు. హ్యామ్ మోడల్ రోడ్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం

మరోసారి రివ్యూ చేసుకోవాలని సూచించారు. ఈ రోడ్లను జేఇంఫ్రా , బృందా ఇంఫ్రా కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాని.. ఈ కంపెనీలకు అనుభవం లేదని.. ఆర్‌అండ్‌బీలో పనులు చేసిన దాఖలాలు లేవని అన్నారు.

దీనిపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలకు తాజాగా కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్