Sunday, September 8, 2024

వేణు నటించిన అతిధి ఓటీటీలో

- Advertisement -

చాలా కాలం తర్వాత,  వేణు తొట్టెంపూడి, అతిధి తన సెకండ్ ఇన్నింగ్స్ లో రవితేజ తో “రామారావు ఆన్ డ్యూటీ ” సినిమా చేసినప్పుడు, అది నిరాశ పరిచింది.  కానీ, అదే వేణు – అతిధి ఓటీటీ సిరీస్ ద్వారా, మంచి నటుడు గా – ఒక హారర్ కధతో మన ముందుకు వచ్చి, సక్సెస్ సాధించాడనే చెప్పాలి. రాజా రవి వర్మ, ( వేణు) కు తన భార్య సంధ్య (అదితి గౌతమ్ – నేనింతే ఫేమ్ )- అంటే ప్రాణం. ఆరోగ్యం బాగా లేని తన భార్య మంచం మీద ఉంటే, రవి వర్మ ప్రేమ గా చూసుకుంటూ తన ప్యాలస్ లో నవలలు రాసుకుంటూ ఇద్దరే ఉంటారు. మంచం మీద, కదల్లేని స్థితిలో ఉన్న తన భార్య పిలవంగానే వెళ్లి మాట్లాడి, ఓదార్చి కిందికి వస్తుంటాడు.

ఒక రాత్రి జోరున వాన పడుతున్న టైమ్ లో, మాయ (అవంతిక మిశ్రా ) అని ఒక అందమైన, అనుమానస్పద మహిళ ప్యాలస్ తలుపు కొట్టి, రాత్రి కి అక్కడే ఉంటానంటే, రవి వర్మ ఒప్పుకుని, లోపాలకి రానిస్తాడు. కాసేపటికి, దెయ్యాలు లేవని బలంగా నమ్మి, అదే వ్యూ నీ అందరికి నిరూపించాలని దెయ్యాల గుట్ట కు బయలుదేరిన, సవారీ అనే యూ ట్యూబర్ (వెంకటేష్ కాకమాను) దెయ్యాన్ని చుసిన భయంతో పాలస్ లోకి పరుగు తో వస్తాడు.

Venu starrer Adhi OTT
Venu starrer Adhi OTT

ఇక్కడ నుంచీ, దర్శకుడు – భరత్ కధ నీ నడిపించిన విధానం బాగుంటుంది. మధ్య లో, రెండు చిన్న కధలు ద్వారా, బలవంతులు చేసే దాష్టి కాలకు, బలహీనులు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉండాలో చూపించాడు. మనిషి లోని, దెయ్యాలు లేవని నిరూపించాలి అని, దాని మీదే వర్క్ చేద్దామని వచ్చిన, యూ ట్యూబర్ సవారీ, దాన్ని ప్రూవ్ చేయగలిగాడా,? అస్సలు దెయ్యం మిడ్నైట్ పాలస్ లోకి వచ్చిన, అందమైన మాయా నేనా….? మాయ ఎవరు?  ఇంకేవరన్నా ఉన్నారా?

సాధారణంగా, హారర్, సస్పెన్సు కంటెంట్ అంటే, కెమెరా పనితనం తో లైటింగ్ ఎఫెక్ట్స్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ తోను ఆ ఫీల్ దర్శకుడు తనదైన ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ, అతిధి ఓటీటి సీరిస్ లో మాత్రం, కెమెరా మాన్ – మనోజ్ బాజపేయి, చాలా డీసెంట్ గా సీన్లు ప్రెసెంట్ చేసాడు. అలాగే -తన బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో – మ్యూజిక్ డైరెక్టర్ -కపిల్ కుమార్, కధ ని చాలా బాగా ఎలివేట్ చేసాడు.

ఇక నటి, నటుల పవర్ఫార్మన్స్ కీ వస్తే, వేణు తోట్టెంపూడి, మొత్తం సిరీస్ ని, సింగిల్ హ్యాండెడ్ గా మోశాడు. ఇక్కడ డైరెక్టర్ వేణు తో క్యారెక్టర్ లో అండర్ ప్లే చేయించాడు. వేణు తర్వాత చెప్పుకోవాల్సింది, సవారీ పాత్ర పోషించిన,వెంకటేష్ కాకమాను మొత్తం సిరీస్ అంతా ఒకే టెంపో లో మైంటైన్ చేసి, క్యారెక్టర్ ని తన కామెడీ టచ్ తో ప్రాణం పోశాడు. ఇతనికి మంచి ఫ్యూచర్ వుంది, రాబోయే రోజుల్లో ఇంకో కమెడియన్ సత్య ని ఇతనిలో చూడొచ్చు. మాయ గా అవంతిక మిశ్రా బాగా నటించింది. డబ్బు కోసం ఏమైనా చేసే ఒక సగటు బలహీన మనిషి కోణాన్ని తన లో బాగా చూపించింది. మొత్తం గా చెప్పొచ్చేదాంటంటే, కంప్లీట్ ఫ్యామిలీ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా, హ్యాపీగా చూడొచ్చు. మనిషి కీ కామ, క్రోధ, లోభ, మద, మాచ్ఛల్యాలు అనే బలహీనలతలు, ఎంత దూరం తీసుకెళతాయి – మనిషి వీటికోసం ఏమైనా చేస్తాడు- ఇక్కడే హీరో పాత్ర తాలూకు అసలైన క్యారెక్టర్ ని దర్శకుడు భరత్ చాలా బాగా చివర ఎపిసోడ్స్ లో ఎస్టాబ్లిష్ చేసాడు. చెడు మీద మంచి సాధించాల్సిన విజయం, అది చేయడానికి, ఎలాంటి రూపాలయినా ఓకే అనే కధ ని అందంగా, ఇంటరెస్టింగ్ లిమిటెడ్ పాత్ర ధారులతో, చూపించాడు. ఇంకెందుకు ఆలస్యం – డిస్నీ హాట్ స్టార్ – ఓటీ టి లో హ్యాపీగా చూసెయొచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్