- Advertisement -
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ కి వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని తెలిపారు. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని వెల్లడించారు. ఈ కొత్త సంవత్సరం లో ప్రజలకు మేలు జరగాలని.. రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్.
- Advertisement -