రికార్డు సృష్టించిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు
Vijay and Rashmika’s record-breaking wedding photos
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నెల 26న ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట, తమ వివాహ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా లైకుల వర్షం కురుస్తోంది. ఈ పోస్ట్ కేవలం 24 గంటల్లోనే భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసి, సోషల్ మీడియాలో వారికున్న అసాధారణమైన క్రేజ్ను మరోసారి నిరూపించింది. బాలీవుడ్ జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫొటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే అత్యధిక రికార్డుగా ఉండేది. అయితే, ‘విరోష్’ (విజయ్-రష్మిక) జంట ఈ మైలురాయిని కేవలం 14 గంటల్లోనే దాటేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరి పోస్ట్ 23.3 మిలియన్ల లైక్స్తో దూసుకుపోతోంది. ఎనిమిదేళ్ల రహస్య ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఒక్కటైన ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “నా బెస్ట్ ఫ్రెండ్ను భార్యగా చేసుకున్నాను” అని విజయ్, “నాకు నిజమైన ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి” అని రష్మిక పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్లు నెటిజన్లను మరింతగా ఆకట్టుకున్నాయి. వీరి పెళ్లి ఫొటోలు టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి.



