నడిగూడెం కాలేజీ ప్రిన్సిపల్ గా విజయ నాయక్.

- Advertisement -

నడిగూడెం కాలేజీ ప్రిన్సిపల్ గా విజయ నాయక్

Vijaya Naik as Principal of Nadigudem College.
Vijaya Naik as Principal of Nadigudem College.

కోదాడ /నడిగూడెం

ఆగస్టు 6(వాయిస్ టుడే ప్రతినిధి.).

సూర్యాపేట జిల్లా,నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న కొల్లు లక్ష్మీనరసమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా డి విజయ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు . గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన మన్నే సోమయ్య ఇటీవల పదవి విరమణ పొందడంతో ,బదిలీపై విజయ నాయ క్ నడిగూడెం కళాశాల ప్రిన్సిపాల్ గా వచ్చారు. గతంలో హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల నమోదు హాజరు శాతం పెంపొందించేందుకు అధ్యాపకులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. నడిగూడెం కళాశాలకు పూర్వవైభవం తీసుకురావడంలో సమిష్టి కృషి చేయాలన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపాల్ ను అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జానీ పాషా ,శ్రీధర్ ,,కృష్ణ ,మహేష్ ,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular