- Advertisement -
పెట్టుగొళ్లపల్లిలో పల్లె పండుగ
Village festival in Pettugollapally
పాల్గోన్న హోంమంత్రి అనిత
అనకాపల్లి
యస్ రాయవరం మండలం పెట్టుగొళ్ళపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గోన్నారు. సీసీ రోడ్డు శుంకుస్థాపన చేసారు.
హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో పల్లె పండుగ కార్యక్రమం జరుగుతుంది. గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి లేదు. గ్రామాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్డీయే ప్రభుత్వంలో వందరోజుల్లోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నూతన రోడ్లు,డ్రైన్ లు పనులు శరవేగంగా చేస్తున్నాం. ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించాం. అడ్డురోడ్డు-కోటఊరట్ల రోడ్డు అడ్వానంగా ఉంది. గత ప్రభుత్వంలో అడ్డురోడ్డు-కోటఊరట్ల రోడ్డును పట్టించుకోలేదని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వచ్చేసరికి నూతన రోడ్లు పూర్తి చేయనున్నాం. ఎన్డియే ప్రభుత్వానికి అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఎన్ఆర్ఈజీఎస్ ను నిర్వీర్యం చేసారు. వైసిపి సర్పంచ్ లు కూడా ఎన్డియే ప్రభుత్వం కోసం ఎదురు చూసారని అన్నారు. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ పై హోం మంత్రి అనిత మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా దళితులపై దాడులు చేసారు. దౌర్జన్యాలు చేసారు.నడిరోడ్లుపై కొట్టి చంపారు. మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ చంపారు. వరప్రసాద్ అనే ఒక సామాన్య వ్యక్తి శిరోముండనం చేయించారు. ఇప్పుడు దళిత కార్డు బయటికి తీసుకు వస్తున్న వారు, అప్పుడు ఎందుకు స్పందించ లేదు? దళితురాలైన నన్ను ముంఖ్యమంత్రి హోం మంత్రి చేసారు. చట్టానికి-కులానికి సంభందం లేదు. ఏ కులమైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో నాపై 23 కేసులు పెట్టారు. అసలు క్రిమినల్స్ కు కులం ఏంటని అన్నారు.
- Advertisement -