శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఆళ్లగడ్డ
గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ హనుమంతు నాయక్ హెచ్చరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆళ్లగడ్డ డీఎస్పీ షర్ఫుద్దీన్ పర్యవేక్షణలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మకమైన గ్రామాలైన s.లింగందిన్నే మరియు చిన్నకందుకూరు లో ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, రూరల్ ఎస్సై నరసింహులు కలిసి బిఎస్ఎఫ్ సిబ్బంది, ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.