
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొండా సురేఖ ని గెలిపించడమే లక్ష్యంగా కదులుతున్న ప్రజలు…
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో: వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 22వ డివిజన్ లో చేరికల సందర్భంగా కొండా సుస్మిత పటేల్ రాగానే బాణాసంచా పేలుస్తూ గజమాలతో భారీగా స్వాగతం పలికిన కార్యకర్తలు అనంతరం ఎస్సీ కాలనీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు, మహిళలు 200 మంది మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన కొండా దంపతుల రాజకీయ వారసురాలు కొండా సుస్మిత పటేల్
కొండ సుస్మిత పటేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నరేందర్ చేసే అరాచకాలు అన్యాయాలు అవినీతి అక్రమాలు నలిగిపోయిన పేద ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలియజేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలలో ఏమీ అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు అధికారం అడ్డం పెట్టుకుని సామాన్యులకు చేసిందేమీ లేదు కానీ హంగు ఆర్భాటాలే తప్ప అని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోరులో ఉందని అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మోసపూరితపు మాటలకు దొంగ హామీలకు లొంగకూడదని ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కొండా సురేఖ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొండా సుస్మిత పటేల్ కోరడం జరిగింది. కొండా దంపతులు మీకు ఎల్లవేళలా ఎలాంటి ఆపదలోనైనా అండగా ఉంటారని ప్రతి ఒక్క కార్యకర్తను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కొండ కుటుంబం తీసుకుంటుందని కొండా సుస్మిత పటేల్ తెలియజేశారు….


