గత ఎన్నికలలో తక్కువ శాతం పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో గత ఎన్నికలలో తక్కువ శాతం పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో స్వీప్ ఆధ్వర్యంలో మెప్మా మహిళలకు, బిఎల్వోలకు, సిబ్బందికి ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ యాస్మిన్ బాషా సూచనలతో జిల్లా స్వీప్ అధికారి కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో…గురువారం పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వీప్ జిల్లా అధికారి కె.లక్ష్మినారాయణ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీమతి సునీత, స్వీప్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్,
ఈ సందర్భంగా జిల్లా స్వీప్ అధికారి కె.లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైనదని అందుకే అర్హులైన వారందరు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మెప్మా మహిళలు సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఓటు హక్కు వినియోగం, సక్షమ్, సి-విజిల్ , ఓటర్ హెల్ప్ లైన్ ఆప్ ల డౌన్ లోడ్, 1950 తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు..ఓటరు స్లిప్పుల పంపిణీని ఇంటింటా త్వరితగతిన పంపిణీ చేయాలని ఈ సందర్భంగా బిఎల్వో లకు సూచించారు.ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి రజిత, బిఎల్వోలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.



