కరీంనగర్: జీవనోపాధి కోసం అప్పులు చేసి అమెరికా వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడగా తన పార్ధివ దేహాన్ని తీసుకొచ్చేందుకు డబ్బులు లేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన వెలిచాల అనిల్ అనే యువకుడు తమ కుటుంబ పోషణ కోసం హోటల్ మేనేజ్మెంట్ ఉధ్యోగం చేసేందుకు అమెరికాకు వెళ్లారు. తన చెల్లెలి వివాహం కోసం దాచిన డబ్బులు అనిల్ అమెరికా ప్రయాణానికి ఏర్పాటు చేసారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, నాలుగు నెలల తరువాత అనిల్ ఉరి వేసుకుని మరణించాడు. అనిల్ మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. నిరుపేద కుటుంబం అనిల్ మృతదేహం ఇండియాకు తీసుకొచ్చేందుకు నానాయాతన పడుతున్నారు. అనిల్ మృతదేహం తెచ్చేందుకు వారు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు..



