వార్ వన్ సైడే
భారీ ఆధిక్యంతో ఎన్డీయే కూటమి
విజయవాడ, జూన్ 4
ఏపీలో వార్ వన్ సైడ్. టిడిపి కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. ఏకంగా క్లీన్ స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి సాలిడ్ విజయం దక్కగా.. జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం దిశగా ముందుకెళ్తోంది. అటు బిజెపి సైతం మెరుగైన స్థానాలను దక్కించుకోనుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. దాదాపు 160 స్థానాల వరకు టిడిపి గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాదాపు 130 వరకు ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఫలితాలు వస్తాయని తెలుగుదేశం పార్టీ సైతం ఊహించలేదు. 2019 ఎన్నికల్లో సైతం 102 స్థానాలతోనే టిడిపి సరిపెట్టుకుంది. అటువంటిది టిడిపికి సాలిడ్ విజయం దక్కడంతో టిడిపి శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఐదేళ్లుగా టిడిపి శ్రేణులు ఎంతగానో ఇబ్బంది పడ్డాయి. బలపడేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. జనసేనతో కూటమి కట్టిన ఆయన అతి కష్టం మీద బిజెపి స్నేహాన్ని అందుకోగలిగారు. మూడు పార్టీల మధ్య సమన్వయం, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగడంతో కూటమి లక్ష్యానికి మించి సీట్లు దక్కించుకుంది.ఏపీలో టిడిపి కూటమి విజయం వెనుక జనసేన కీరోల్ ప్లే చేసింది. కూటమి కట్టడంలో పవన్ పాత్ర అభినందనీయం. ఎన్నెన్నో అడ్డంకులు సృష్టించారు. పొత్తుపై విషప్రచారం చేశారు. మూడు పార్టీలు కలవకూడదని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాటిని సాధ్యం చేశారు పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటు నుంచిఓట్ల బదలాయింపు వరకు.. ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ యాక్టివ్ రోల్ ప్లే చేశారు. పొత్తు లో భాగంగా 21 సీట్లను తీసుకున్న పవన్ ను ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు.తాను బలంగా ఉన్న చోట మాత్రమే టికెట్లు తీసుకుంటానని చెప్పిన పవన్ అందుకు అనుగుణంగా.. సీట్లు సొంతం చేసుకోవడం విశేషం.అయితే ఎన్నడూ లేని విధంగా ఏపీలో భారతీయ జనతా పార్టీ సైతం బలపడింది. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓటింగ్ కూడా సాధించలేదు. అటువంటిది ఈసారి ఏకంగా నాలుగు శాతం వరకు ఓట్లు సాధించింది ఆ పార్టీ. సీట్ల పరంగా గణనీయంగా మెరుగుపడింది. అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లను సైతం గెలుచుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీ తీసుకున్నది కేవలం 10 అసెంబ్లీ సీట్లు. ఆరు పార్లమెంట్ స్థానాలు. కానీ మెరుగైన స్థానాలను దక్కించుకోవడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. గ్లాసు గలగల లాడుతుండగా.. సైకిల్ కిలకిలలాడుతోంది. కమలం అయితే వికసించి.. తెగ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్ మాత్రం రెక్కలు వీడి.. తిరిగేందుకు కూడా సతమతం అవుతోంది.
వార్ వన్ సైడే భారీ ఆధిక్యంతో ఎన్డీయే కూటమి
- Advertisement -
- Advertisement -