- Advertisement -
వరంగల్ లోక్ సభ అభ్యర్ధి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య పార్టీకి రాజీనామా చేయడంతో గులాబీ అధిష్టానం డైలమాలో పడింది.
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా బాబు మోహన్ ను దించాలని ప్రయత్నిస్తుంది. రేసులో స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, వరంగల్ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కారులు బోడ డిన్న, జోరిక రమేష్ పేర్లను బీఆర్ఎస్ పార్టీ పరిశీలింస్తుంది. పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్ లతో గులాబీ బాస్ చర్చించినట్టు తెలుస్తోంది.
- Advertisement -