Sunday, February 9, 2025

వచ్చే నెలలో వరంగల్ ఆస్పత్రి ప్రారంభం..

- Advertisement -

వచ్చే నెలలో వరంగల్ ఆస్పత్రి ప్రారంభం..

Warangal Hospital to start next month

వడివడిగ పనులు
వరంగల్, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
తెలంగాణ రాష్ట్రానికి వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాలుగా కృషి చేస్తోంది. ఈ మేరకు.. అన్ని రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రవాణా సౌకర్యాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. రైల్వేలైన్లు, రోడ్డు మార్గాల నిర్మాణంపై కసరత్తు చేస్తోంది. మరోవైపు.. మామునూరు ఎయిర్‌పోర్టు పనుల్లో వేగం పెంచింది. ఇక.. వరంగల్‌లో వైద్యరంగాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే.. వరగంల్‌ను హెల్త్ సిటీగా మార్చాలన్న ఉద్దేశంతో.. నగరంలోని సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల్లో వేగం పెంచింది.గత ప్రభుత్వ హయంలో 2021 జూన్‌ 21న మొదలుపెట్టిన 24 అంతస్తుల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భవన నిర్మాణం ఇప్పటికే పూర్తవగా.. ప్రస్తుతం లోపల అత్యవసర సేవలు, 12 అంతస్తుల్లోని పకడలకు ఆక్సిజన్, ఫైర్, సెంట్రల్‌ ఏసీలైన్, విద్యుత్తు, నీటిపైప్‌లు, క్యాన్సర్‌ విభాగానికి రేడియేషన్‌ థెరపీ కోసం ప్రత్యేక బంకర్ల నిర్మాణం, ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణం అందులోని అన్ని అనగా ఆక్సిజన్, ఫైర్, ఏసీ, విద్యుత్తు, నీరు సరఫరాకు సంబంధించిన అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు నోడల్‌ అధికారి, ఎంజీఎం ఇంఛార్జి సూపరింటెండెంట్ డా. కిషోర్‌కుమార్‌ తెలిపారు.అయితే.. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 59 ఎకరాల్లో 24 అంతస్తుల్లో నిర్మిస్తుండగా.. 12 అంతస్తుల్లో 34 వైద్యవిభాగాల ఓపీ, ఐపీ సేవల కోసం వినియోగించుకునేందుకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ ఆస్పత్రిలో ఏకంగా.. 2208 పడకలు, 500 మంది డాక్టర్లు, 1000 మంది స్టాఫ్‌ నర్సులు, మరో 1000 మంది పారా మెడికల్‌ వైద్య సిబ్బంది సేవలందించేలా సదుపాయాలు కల్పిస్తున్నారు.ఇక.. మిగిలిన అంతస్తుల్లో డాక్టర్ల సమావేశ మందిరం, పీజీ విద్యార్థుల తరగతి గదులు, గ్రంథాలయం, ల్యాబ్‌లు, ఇలా అన్నిరకాల సదుపాయాలు కల్పించనున్నారు. ఈ మేరకు.. అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయి.కాగా.. భవన నిర్మాణం, సర్వీసుల కోసం రూ.884 కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.107 కోట్లతో వైద్యపరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక.. మిగతా పనులకు రూ.125 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. మొత్తంగా.. రూ.1,116 కోట్లతో ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే.. వరంగల్ జిల్లా ప్రజలకు వైద్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్