స్వచ్ఛదనం..పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య
వరంగల్
Warangal MP participated in cleanliness..green program
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదా, ఇనగల వెంకట్రామరెడ్డి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే లతో కలిసి ర్యాలీని ప్రారంభించి భద్రకాళి దేవాలయం వరకు కొనసాగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలో మంత్రి, ఎంపీ మేయర్, చైర్మన్, కలెక్టర్లు మొక్కలను నాటారు.