మంథని అంబేద్కర్ నగర్ లో వార్డు సందర్శన

- Advertisement -

మంథని అంబేద్కర్ నగర్ లో వార్డు సందర్శన

-పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి

మంథని

మంథని మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో శుక్రవారం వార్డు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించగా మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
వార్డు సందర్శనలో భాగంగా స్థానికంగా ఉన్న ప్రజలతో కలియ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంథని మున్సిపాలిటీ లోని అన్ని వార్డులను శుభ్రపరచటం లో కీలకంగా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ  సంఖ్య లో ఉన్న అంబేద్కర్ నగర్లో పారిశుద్ధ్యం పట్ల గత పాలకులు నిర్లక్ష్యం గా వ్యవహరించటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో డ్రైనేజీ లను శుభ్రం చేసి ప్రజలకు ఉన్న అసౌకర్యాలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగారపు కిష్టయ్య, బండారి ప్రసాద్, తదితరులతో పాటు వార్డు ప్రజలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular