గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి
జగిత్యాల
సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం వినోద్ కుమార్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, వలస కార్మికుల నాయకురాలు సిస్టర్ లిజీ జోసెఫ్ శుక్రవారం జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఈ బడ్జెట్ లో గల్ఫ్ సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క,
పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను కలిసి గల్ఫ్ సంక్షేమం అంశాన్ని వారి దృష్టికి తీసికెళతానని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారని భీం రెడ్డి తెలిపారు.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు విషయం ఇదివరకే సీఎం దృష్టికి తీసికెళ్లానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.


