రుణమాఫీ అమలుతో మా జన్మధన్యమైంది
త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నాం
రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారని
రుణమాఫీపై విపక్షాలు రంధ్రానేష్వణ చేస్తున్నాయి
రెండు లక్షల రూపాయాల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నాయి
ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాము
ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణకు కట్టుబడి ఉన్నాం
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగుర వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
We are going to start Rythu Bharosa Scheme soon
హైదరాబాద్ ఆగష్టు 15
వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారని, రెండు లక్షల రూపాయాల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామని, రుణమాఫీపై విపక్షాలు రంధ్రానేష్వణ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందడంలేదని, అలాంటి వారిని గుర్తించి రుణమాఫీ అమలు చేస్తామన్నారు. కలెక్టరేట్ లో కౌంటర్లు ఏర్పాటు చేసి రుణమాఫీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రుణమాఫీ అమలుతో మా జన్మధన్యమైందని భావిస్తున్నామన్నారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగురవేశారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ప్రపంచ అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా జరిగిందని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని పేర్కొన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని, ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చామని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ తెలియజేశారు. 43 లక్షల మందికి రూ.500 గ్యాస్ సిలిండర్ అందుతోందని కొనియాడారు. అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తామని, గత ప్రభుత్వం అనర్హులకు రైతుబంధు ఇచ్చిందని మండిపడ్డారు. త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నామని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.