తెలంగాణలో డబుల్ డిజిట్‌లో గెలవబోతున్నాం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమాజిగూడలోని ఠాకూర్ మాన్షన్‌లో స్థానిక సీనియర్ బీజేపీ నేత సాధనా ఠాకూర్ ఏర్పాటు చేసిన కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో మోదీ సారధ్యంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పరిష్కారం చేస్తామని, అమలు చేస్తామని చెప్పి విస్మరించిందని, రైతులకు రుణ మాఫీ కావొచ్చు, ఎకరానికి 10 వేల సాయం చేస్తామని చెప్పి మోసగించారని ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ది చెప్తారనిఅన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో డబుల్ డిజిట్‌లో గెలవబోతున్నాం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -