గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో.. తప్పులున్న వాటిని నిలిపివేస్తున్నాం
హైదరాబాద్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు..
అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100 రోజులు ఉందని.. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి.. ప్రచారానికి సమరశంఖం మోగిస్తున్నటు ప్రకటించారు..
గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని జీవోల్లో తప్పులున్న జీవోలను నిలిపివేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిపై విచారణ సంస్థలు విచారణ చేపట్టాయని… ప్రజాస్వామ్యయుతంగా పద్దతిగా ప్రాసెస్ జరుగుతుందని జరిగిన తప్పులను ఇన్వెస్టిగేటీవ్ ఏజెన్సీలు తేల్చుతాయన్నారు. గత ప్రభుత్వంలో తప్పులున్న జీవీలోను తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిన జీవోలను వెంటనే నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు..