53 లక్షల మెట్రిక్ టన్నుల స్ట్రాటజిక్ రిజర్వ్ పెట్రోల్ ఉంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ మార్చ్ 23
We have a strategic reserve of 5.3 million metric tonnes of petrol: PM Modi
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై ఇవాళ ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. దౌత్యం, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. దౌత్యపరమైన అంశంలో భారత్ స్పష్టంగా ఉందని, శ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సమస్యలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ యుద్ధం నుంచి ఉద్భవించే పరిస్థితులు చాన్నాళ్లు ప్రభావం చూపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ పరిస్థితులను ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొందరు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే శాంతి భద్రతలను సరైన రీతిలో మానిటర్ చేయాలన్నారు.సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని అన్నారు. గత దశాబ్ధం కాలం నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రియార్టీ ఇచ్చామని, దీనిలో భాగంగా ముడి చమురును స్టోరేజీని పెంచామన్నారు. భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల స్ట్రాటజిక్ రిజర్వ్ పెట్రోల్ ఉందని ప్రధాని వెల్లడించారు. ఇది ఆయల్ కంపెనీల వద్ద ఉన్న రిజర్వ్‌లకు సంబంధం లేనిదని ఆయన అన్నారు. గడిచిన 11 ఏళ్ల కాలంలో రిఫైనరీ కేపాసిటీ కూడా పెంచుకున్నామని ప్రధాని తెలిపారు. వ్యవసాయంపై కూడా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతుందని, కానీ ప్రభుత్వం మాత్రం కావాల్సినంత ఫెర్టిలైజర్‌ను సమకూర్చుతోందన్నారు.రైతులపై కోవిడ్ లాంటి పరిస్థితులు ప్రభావం పడకుండా చూస్తున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్దం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 3.75 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చినట్లు చెప్పారు. కేవలం ఇరాన్ నుంచి 1000 మంది భారతీయులు సురక్షితంగా వచ్చినట్లు వెల్లడించారు. దీంట్లో ఎంబీబీఎస్ చదువుతున్న 700 మంది విద్యార్థులు ఉన్నారు. పశ్చిమాసియా ప్రభావాన్ని తగ్గించేందుకు స్వల్ప కాలిక, మధ్యశ్రేణి, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు.యుద్ధం జరుగుతున్న పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం పట్ల భారత పార్లమెంట్ ఒకే స్వరాన్ని వినిపించాలన్నారు. ఆ సంక్షోభం మొదలై మూడు వారాలు దాటిందని, ప్రతి ఒక్కరికీ అది ప్రభావం చూపుతోందని, యుద్ధం జరుగుతున్న దేశాలతో భారత్‌కు కీలకమైన వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోలియం రిజర్వ్‌లు ఉన్నాయని, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల .. గతంతో పోలిస్తే భారత్ సుమారు 4.5 కోట్ల బ్యారళ్ల ఇంధనాన్ని తక్కువ దిగుమతి చేసుకుంటోందని ప్రధాని తెలిపారు.



