ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశాం
ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్
We have cleared all employees’ medical bills.
— Deputy Chief Minister Bhatti
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు పెండింగ్ లో పెట్టి వెళ్లిన మూడు డి ఏ ల ను మా ప్రభుత్వం చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడు సంవత్సరాలకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. నాలుగవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 61సంవత్సరాలకు పెంచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో 17వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వం పైపడింది. ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి గత ప్రభుత్వం 40, 150 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ విషయంపై సభలో శ్వేత పత్రం విడుదల చేసాం. ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మొత్తం 4,575 కోట్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల 700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. రాబోయే రోజుల్లో బకాయిలు త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రతినెలా చెల్లించి 700 కోట్లను 1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.



