Friday, December 13, 2024

ప్రేమ పెళ్లికి అక్క అడ్డంకి అని చంపేశాం….…

- Advertisement -
  1. అక్కను అందుకే చంపేశాం….

నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు

జగిత్యాల జిల్లా బ్యూరో /రాజేష్ బొంగురాల (సీనియర్ జర్నలిస్ట్)సెప్టెంబర్ 02,23(వాయిస్ టుడే): జగిత్యాల జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు.తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు హంతకులు…

we-killed-the-older-sister-as-an-obstacle-to-love-marriage
we-killed-the-older-sister-as-an-obstacle-to-love-marriage

దీప్తి చెల్లి, ఆమె ప్రియుడే హంతకుడని తేల్చారు..

దీప్తి సోదరి చందన, ఆమె ప్రియుడిని వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మొదటి నుంచి ఈ కేసులో సోదరిపైనే అనుమానం ఉండేది. అయితే హత్య జరిగిన రెండోరోజు తమ్ముడికి ఫోన్ చేసిన చందన… తనకు ఎలాంటి పాపం తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అసలు హంతకుడు ఎవరు అనే సస్పెన్షన్ కొనసాగింది.  చివరకు పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అక్క చనిపోయిన రోజే సోదరి కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. తెల్లవారుజామున బస్టాండులో ప్రియుడితో కనిపించడం సైతం అనుమానాలను బలపరిచింది. చివరకు అదే నిజమైంది.

మొదటి నుంచి ఈ కేసులో సోదరిపైనే అనుమానం…

అయితే హత్య జరిగిన రెండోరోజు తమ్ముడికి ఫోన్ చేసిన చందన… పోలీసుల విచారణలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో బీటెక్ చదివిన చందన…  తన కాలేజీలో సీనియర్ వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంది. విషయాన్ని అక్క అయిన దీప్తికి చెప్పింది. చెల్లి చందన ప్రేమ సంగతి తెలుసుకున్న అక్క దీప్తి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ వ్యక్తి వేరే మతస్తుడు కావడంతో కుటుంబ సభ్యులు చందన ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. విషయంపై చర్చలు నడుస్తుండగానే వేరే బంధువులు ఇంటికి వెళ్లారు వాళ్ల పేరెంట్స్. ఇంట్లో దీప్తి, చందన మాత్రమే ఉన్నారు. తన ప్రేమ పెళ్లికి అక్క దీప్తియే అడ్డంకిగా ఉందని మెయిన్ విలన్ అవుతుందని భావించింది చందన. అక్క అడ్డుతొలగించుకునేందుకు డిసైడ్ అయింది. లిక్కర్ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్లి చందన.. తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇలా వచ్చిన వాళ్లిద్దరు దీప్తిని చంపేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. చందన, ఆమెప్రియుడు దీప్తిని చంపడంలో, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడంలో కొందరి బంధువులు, డ్రైవర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బంక దీప్తి నాలుగు రోజుల కిందట తన ఇంట్లో చనిపోయి ఉంది.

we-killed-the-older-sister-as-an-obstacle-to-love-marriage
we-killed-the-older-sister-as-an-obstacle-to-love-marriage

ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు 25 ఏళ్ల కిందటే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి ఇటుక బట్టీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతలుకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి సాఫ్ట్ వేరఇంజినీర్. కాగా, కోరుట్లలోనే ఉంటూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ఇంటి వద్దే ఉండగా, కుమారుడు బెంగళూరులో డిగ్రీ చదవుతున్నాడు.శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు సోమవారం రోజు ఉదయం హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. కుమారుడు బెంగళూరులో చదువుకుంటుండగా.. ఇంట్లో అక్కాచెల్లెళ్లు దీప్తి, చందన మాత్రమే ఉన్నారు. ఆరోజు రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెళ్లతో తల్లిదండ్రులు ఫోన్ లో మాట్లాడారు. ఆలస్యమైందని, మరుసటి రోజు వస్తామని తల్లిదండ్రులు చెబితే దీప్తి, చందన సరే అన్నారు.  మరుసటి రోజు ( మంగళవారం) ఉదయం ఓ కూతురి నెంబర్ కు శ్రీనివాస్ రెడ్డి కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయడం లేదని మరో కూతురు నెంబర్ కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వారికి అనుమానం కలిగింది. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి ఇంట్లో చూడాలని అడిగారు. మధ్యాహ్నం ఓ మహిళ వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది, లోపలికి వెళ్లి చూడగా చిన్న కూతురు చందన కనిపించలేదు. పెద్ద కూతురు దీప్తి సోఫాలో కనిపించింది. భయంతో స్థానికులను పిలవగా వాళ్లు వచ్చి చూసి దీప్తి అప్పటికే చనిపోయి ఉందని నిర్ధారించుకున్నారు. పోలీసులతో పాటు  వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్ కుమార్, చిరంజీవి అక్కడికి వెళ్లి పరిశీలించారు. వంట గదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు, స్నాక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి అక్కాచెల్లెళ్లు మద్యం సేవించారని అనుకున్నారు. కానీ తెల్లవారుజామున అక్క సోఫాలో చనిపోయి కనిపించగా, చెల్లెలు ఓ యువకుడితో నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది.  తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాను అక్కను చంపలేదంటూ సోదరుడు సాయికి రెండో అక్క చందన వాయిస్ మెస్సేజ్ చేసినట్లు సర్క్యూలేట్ అయింది. మరోవైపు దీప్తి శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆమెపై దాడి చేసి హత్య చేసింది ఎవరు, ఆమె చెల్లెలు చందన అదే సమయంలో ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు చంపింది ఎవరో కాదు సొంత చెల్లి, ఆమె ప్రియుడే ఈ ఘోరానికి పాల్పడినట్టు తేల్చారు పోలీసులు.

Press meet లో…

తేదీ: 29-08-2023 రోజున కోరుట్ల పట్టణానికి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి S/o Late. వెంకట్ రెడ్డి తన కూతురు తన పెద్ద కూతురైన బంక దీప్తి D/o శ్రీనివాసరెడ్డి, వయసు: 22 సంవత్సరంలు అనునామే తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిందని కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఈ క్రింది వివరాలు వెల్లడించడం జరిగింది.
ఫిర్యాది అయినా బంక శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం కలరు. పెద్ద కూతురైన బంక దీప్తి D/o శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజుల నుండి సాఫ్ట్ వేర్ జాబ్ తన ఇంటిలో నుండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నది. చిన్న కూతురైన బంక చందన 2019 సంవత్సరంలో మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంలో తన క్లాస్మేట్ అయిన ఉమర్ షేక్ సుల్తాన్ S/o హుస్సేన్, వయసు: 25 సంIIలు అనునతనితో పరిచయమై వారి పరిచయం ఇద్దరికీ ప్రేమగా మారింది. ఈ సందర్భంలో వారి బీటెక్ నాలుగు సంవత్సరాలు పూర్తయి చందన గత కొద్ది రోజుల నుండి కోరుట్లలోని తన ఇంటి వద్దనే ఉంటున్నది. తన బాయ్ ఫ్రెండ్ అయినా షేక్ సుల్తాన్ కు చందన ఫోన్ చేయగా అప్పుడప్పుడు కోరుట్ల కు వచ్చి చందనను కలుస్తుండేవాడు. ఈ క్రమంలో తేదీ: 19-08-2023 రోజున కోరుట్లకు ఉమర్ వచ్చినప్పుడు చందన ఉమర్ తో మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు బయటికి పోయి పెళ్లి చేసుకుందామని చెప్పగా అందుకు ఉమర్ జాబ్, డబ్బులు లేకుండా బయటకు వెళ్లి ఎలా జీవిస్తామని చందనను ఉమర్ అడగగా లేదు మనం ఏదైనా సరే పెళ్లి చేసుకోవాలని చందన ఉమర్ కు చెప్పగా ఉమర్ వాట్సాప్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులైన తల్లి సయ్యద్ ఆలియా మహబూబ్, చెల్లె ఫాతిమా మరియు తన ఫ్రెండ్ అయిన హఫీజ్ తో కలిసి చందనతో మాట్లాడారు. తర్వాత రెండు రోజులకు చందన ఉమర్ కు ఫోన్ చేసి మా ఇంట్లో బంగారం డబ్బులు బాగా ఉన్నాయని వాటిని తీసుకెళ్లి మనం పెళ్లి చేసుకొని బతుకుదామని చెప్పింది అప్పుడు ఉమర్ తన కుటుంబ సభ్యులకు చందన వద్ద పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు ఉన్నాయని చెప్పినది.
పథకంలో భాగంగా చందన ఉమర్ కి కాల్ చేసి తేదీ: 28-08-2023 రోజున మా తల్లిదండ్రులు హైదరాబాదులోని ఒక ఫంక్షన్ కి వెళ్తున్నారు. అక్క దీప్తి మరియు చందన ఇద్దరమే ఉంటామని ఉమర్ కు చెప్పి రమ్మని చెప్పింది తేదీ: 28-08-2023 రోజున ఉదయం 7 గంటల సమయంలో ఉమర్ తన కారులో హైదరాబాదు నుండి బయలుదేరి 11:00 గంటలకు కోరుట్ల కు చేరుకున్నాడు.
పథకం ప్రకారం చందన వోడ్కా అక్కకు త్రాగిపించి తను పడుకున్న తర్వాత రాత్రి అందాద 02:00 సమయంలో ఉమర్ కు తన ఇంటికి రమ్మని మెసేజ్ చేయగా ఉమర్ చందన ఇంటి వెనకాల కారును పార్కు చేసి ఇంటి వెనకాల గేటు నుండి ఇంటిలోకి ప్రవేశించినాడు పథకం ప్రకారం తన ఇంటి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా అలికిడికి అక్క దీప్తి లేచి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావే అని అరుపులు అరవగా, టేప్ లతో చందన, ఉమర్ లు ఇద్దరు కలిసి దీప్తి యొక్క ముక్కు, మూతికి స్కార్పు చుట్టి, చున్నీతో చేతులు కట్టేసి, మరియు మూతి, ముక్కుపై టేపును అంటించి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కట్లన్నీ విప్పేసి మందు త్రాగి చనిపోయిందని నమ్మించే విధంగా సీన్ క్రియేట్ చేసి డబ్బు మరియు నగలుతో ఇంటి నుండి పారిపోయినారు. నిందితులను పట్టుకోవడానికి జగిత్యాల SP A. భాస్కర్ గారి ఆదేశాల మేరకు మెట్పల్లి DSP రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోరుట్ల CI ప్రవీణ్ కుమార్ మరియు ఐదు బృందాలు SIs కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మరియు సిబ్బందితో ఏర్పాటు చేయగా నమ్మదగిన సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు ఐదుగురు నిందితులు కలిసి మహారాష్ట్ర వైపు పారిపోతున్నారని సమాచారం రాగా ఆర్మూర్, బాల్కొండ రూట్లో జై వీర్ తేజ దాబా వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

నిందితుల వివరాలు:
A-1 బంక చందన (Korutla)
A-2 ఉమర్ షేక్ సుల్తాన్ (Nellore AP now Hyderabad)
A-3 సయ్యద్ అలియా మహబూబ్ (Nellore AP now Hyderabad)
A-4 షేక్ అసియా ఫాతిమా (Nellore AP now Hyderabad)
A-5 హఫీజ్ (Nellore AP now Hyderabad)
నిందితుల నుండి స్వాధీనపరచుకున్న వస్తువులు:
బంగారు వడ్డానంలు – 2
పెద్ద బంగారు హారం – 1
పెద్ద బంగారు గాజుల జత – 3
ఒక బంగారు కంకణం
చిన్న హారాలు-1
ఒక లక్ష రూపాయల నగదు
వారి సెల్ ఫోన్లు మరియు ఒక కారు స్వాధీనం చేసుకోవడం జరిగింద.

కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన మెటుపల్లి DSP రవీందర్ రెడ్డి, కోరుట్ల CI ప్రవీణ్ కుమార్, Korutla SI లు కిరణ్, Medipalli SI చిరంజీవి, Kathalapur SI కిరణ్ కుమార్ మరియు PCs Vijay, Purushthoam మరియు Srinu Nayak constables ను జగిత్యాల SP A. భాస్కర్ గారు అభినందించినారు.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్