కేవలం 1.85 శాతం ఓట్లతేడాతో ఓడిపోయాం
కరీంనగర్
సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటిఆర్ హాట్ కామెంట్స్ చేసారు. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీ హామీలు కాదు, 420 హామీలు. బిసి డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇలా అన్ని కలిపి హామీలు 420 ఉన్నాయి. 420 హామీలు అమలు చేయలేకపోతే బట్టలు ఊడదీసి కొడుతాం. అబద్దాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. గుంపు మేస్త్రీ దావోస్ కు పోయి అబద్ధాలతో అడ్డగోలు మాట్లాడారు. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడుతా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రైతుబంధు పడని రైతులు చెప్పుతో కోడుతారో ఓటుతో కొడుతారో ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజుల్లో అనేక మందిని శత్రువులుగా చేసుకుంది. ఆర్టీసీ ఫ్రీ బస్ తో మహిళా సోదరుమణులు కొట్టుకుంటున్నారు. కరీంనగర్ కు చెందిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్రీ బస్ పెట్టే ముందు ఆలోచించరా? కోటి 57 లక్షల మంది 18 ఏళ్ళ పైబడిన మహిళలు ఉన్నరు. వారందరికీ నెలకు 2500 ఇవ్వాలి… లేకుంటే సోషల్ మీడియా వేదికగా తాటతీయాలని అన్నారు.
కేసిఆర్ తయారు చేసిన ముగ్గురం మాట్లాడితేనే ఇలా ఉంటే కమాండర్ దిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాంగ్రెస్ అడ్డగోలు హామీల ఇచ్చి తప్పించునేందుకు గుప్పిగంతులు వేస్తుంది. ఇక బిజేపి దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. ఐదేళ్ళలో బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలి. మేము సవాల్ చేస్తున్నాం.. బహిరంగ చర్చకు సిద్ధమా బండి సంజయని అన్నారు.
చాలా మంది చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. మొన్నటి ఫలితం మనం ఇంట్లో దుప్పటి కప్పుకునేలా ఉందని అనుకోవద్దు. ప్రజలను కించపరిచేలా భావోద్వేగాలతో సోషల్ మీడియా మెస్సెజ్ లు పెట్టవద్దు. ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం… నాయకులను మోసం చేసిన ప్రజలను చూశామని సోషల్ మీడియా లో మెస్సెజ్ పెట్టడం మంచిది కాదు. కేవలం 1.85 శాతం ఓట్లతేడాతో ఓడిపోయాం. వన్ థర్డ్ సీట్లు గెలుచుకున్నాం… 14 సీట్లలో స్వల్ప ఓట్లతేడాతో ఓడిపోయాం. దరిద్రమైన ఓటమికాదు..ప్రజలు మనల్ని చీకొట్టినట్లు కాదు. సెంటిమెంట్ తో కాంగ్రెస్ గెలిచిందితప్ప…మనవాళ్ళు మంచోళ్ళు కాదని ఓడించలేదని అన్నారు.
కేవలం 1.85 శాతం ఓట్లతేడాతో ఓడిపోయాం
- Advertisement -
- Advertisement -